![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -378 లో... జ్యోత్స్న గురించి దశరథ్ చెప్పగానే.. జ్యోత్స్న ఎలాంటిదో మావయ్యకి కూడా తెలిసిపోయింది అన్నమాట అని కార్తీక్ అనుకుంటాడు. అసలు దాస్ ని దీప ఎందుకు కొట్టింది.. ఆ విషయం తెలుసుకోవాలని దశరథ్ అంటాడు. దీప మీ కూతురని చెప్తాడేమోనని జ్యోత్స్న కొట్టింది.. కానీ ఆ విషయం ఇప్పుడు మీతో చెప్పలేనని కార్తీక్ అనుకుంటాడు. ఎలాగైనా దాస్ గురించి కనుక్కోమని దశరథ్ అనగానే నేను చూసుకుంటానని కార్తీక్ అంటాడు. ఈ విషయం నీకెందుకు చెప్పానంటే నన్ను నీకంటే ఎవరు బాగా అర్ధం చేసుకోరని దశరథ్ అంటాడు.
మరొకవైపుఅమ్మకి కాల్ చెయ్ అని కాంచనని శౌర్య అడుగుతుంది. దీపకి కాంచన ఫోన్ చేస్తుంది. శౌర్యతో దీప మాట్లాడుతుండగా అప్పుడే జ్యోత్స్న వచ్చి ఫోన్ లాక్కుంటుంది. పని చేసేటప్పుడు ఫోన్ ఏంటని జ్యోత్స్న ఫోన్ ఆఫ్ చేస్తుంది. ఆ తర్వాత కార్తీక్ కి ఫోన్ చేస్తుంది శౌర్య. మీరు ఎక్కడున్నారు నేను వస్తానని శౌర్య అనగానే శివన్నారాయణ ముందు కావాలనే.. రండి శౌర్య అందరు కలిసి అని కార్తీక్ అంటాడు. ఇక నాన్న మనల్ని రమ్మని పిలిచాడని శౌర్య చెప్తుంది. కార్తీక్ బాబు రమ్మంటున్నాడు కదా వెళదామని కాంచనతో అనసూయ అంటుంది.
మరొకవైపు దశరథ్ కిందపడిపోతుంటే.. నాన్న అంటూ దీప పట్టుకుంటుంది. అది జ్యోత్స్న విని మా డాడ్ ని అలా పిలుస్తావా అంటూ దీపని కొట్టబోతుంటే కార్తీక్ వచ్చి ఆపుతాడు. దీప చేసిన దాంట్లో తప్పేంటి అంటూ జ్యోత్స్న పై కోప్పడతాడు కార్తీక్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |